భోపాల్: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడి మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మరణించారు. పూర్తిగా టీకాలు వేయించుకున్న 54 ఏండ్ల మహిళకు ఈ నెల 15న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భోపాల్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమె గురువారం అర్ధరాత్రి తర్వాత చనిపోయినట్లు భోపాల్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO) డాక్టర్ ప్రభాకర్ తివారీ తెలిపారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నదని చెప్పారు. ఆ మహిళకు కేవలం సాధారణమైన తేలికపాటి రక్తపోటు సమస్య మాత్రమే ఉందన్నారు. ఆమె భర్త కూడా ప్రభుత్వ వైద్యుడేనని అన్నారు. మరోవైపు టీకా రెండు డోసులు తీసుకున్న 69 ఏండ్ల వ్యక్తి గత ఆదివారం రాత్రి ఇండోర్‌లో మరణించాడు.