మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వేస్టేషన్లో ఓ వృద్ధుడిపై పోలీసు కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడిచేశారు. ముఖంపై కాలితో పలుమార్లు తన్నిన పోలీసు.. చివరకు అతడి కాళ్లుపట్టుకుని ప్లాట్ఫాం వద్ద తలకిందులుగా వేలాడదీశాడు. బాధితుడు హంతకుడో, దొంగో అనుకుంటే పొరపాటే. మద్యం మత్తులో తనతో దుర్భాషలాడాడన్న కారణంతో ఆ పోలీసు పండుటాకుపై ఇలా కర్కశంగా ప్రవర్తించాడు. ఈ దారుణాన్ని ఫోన్లో చిత్రీకరించిన ప్రయాణికుడొకరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ వీడియోవైరల్గా మారింది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్ అనంత్మిశ్రాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.