న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్లకు ఇక క్యూఆర్ కోడ్లు తగిలించనున్నట్టు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి ట్విట్టర్లో వెల్లడించారు. దీనివల్ల బరువు, డీలర్ పేరు మొదలైనవి సులభంగా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. గ్యాస్ చౌర్యాన్ని కూడా అరికట్టవచ్చని పేర్కొన్నారు.
సిలిండర్ల రవాణా, పంపిణీపై నిఘా వేసేందుకూ ఇవి ఉపకరిస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. గ్యాస్ చౌర్యాన్ని అరికట్టడంతోపాటుగా సిలిండర్‌కు, డీలర్‌కు, వినియోగదారుకు సంబంధించిన సమస్త సమాచారం కోడ్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం ఏర్పడుతుందని అన్నారు.