న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాపై యాంటీ కరప్షన్ అంబుడ్స్మన్ లోక్పాల్ మంగళవారం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. ఈ కేసు కారణంగా మహువా లోక్సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని క్రిష్ణానగర్ స్థానం నుంచి ఆమె మళ్లీ బరిలోకి దిగుతున్నారు.