న్యూఢిల్లీ : లోకసభ సెక్రటేరియట్ డైరెక్టర్ గౌరవ్ గౌతమ్(40) నోయిడాలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సెక్టార్ 82లోని కేంద్రీయ విహార్-2 సొసైటీలో ఉంటున్న ఈయన సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. పోలీసుల వివరాల ప్రకారం గౌరవ్ గౌతమ్ భార్య తన పుట్టింటికి వెళ్లి తిరిగివచ్చేసరికి ఫ్లాట్ లాక్ చేసి ఉంది.
అనుమానంతో ఆమె సెక్యూరిటీ గార్డ్ సహాయంతో లోపలికి వెళ్లి చూడగా, భర్త ఉరేసుకుని కనిపించారు. వెంటనే అతనిని స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లాట్‌లో లభించిన సూసైడ్ నోట్లో అప్పులగురించిన ప్రస్తావన ఉన్నట్లు పోలీసులు తెలిపారు.