లక్నో: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఇవాళ యూపీలోని సుల్తాన్పూర్ కోర్టులో హాజరయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. స్పెషల్ మెజిస్ట్రేట్ శుభమ్ వర్మ.. రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు. ఆ కేసులో వాంగ్మూలం రికార్డు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే 12 సార్లు విచారణకు రాహుల్ గాంధీ డుమ్మా కొట్టారు. దీంతో మెజిస్ట్రేట్ రాహుల్కు వార్నింగ్ ఇచ్చారు.
అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో.. రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదు చేశారు. 2018లో బెంగుళూరులో జరిగిన ప్రెస్కాన్ఫరెన్స్లో రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆరోపించారు. ఓ మర్డర్ కేసులో అమిత్ షా నిందితుడు అని రాహుల్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ తన వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు అడ్వకేట్ సంతోష్ కుమార్ పాండే తెలిపారు. రాజకీయ కారణాలతో తనను ఇరికించినట్లు ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగే రీతిలో వ్యవహరించినట్లు రాహుల్ ఆరోపించారన్నారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానం ఇచ్చారు. స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆగస్టు 12వ తేదీన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయవాది సంతోష్ తెలిపారు.
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from Sultanpur Court, Uttar Pradesh.
He appeared before the court in connection with a defamation case filed against him for allegedly making objectionable remarks about Union Home Minister Amit Shah. pic.twitter.com/U2CoH1mLu9
— ANI (@ANI) July 26, 2024