Boxer Vijender Singh | మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్ సింగ్ పోటీపడనున్నారు. మధుర లోక్‌సభ స్థానానికి రెండో దశలో అంటే.. ఏప్రిల్ 26వ తేదీన ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
బీజేపీ అభ్యర్థి హేమ మాలిని గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అంటే 2014-2019లో మధుర లోక్‌సభ నుంచి గెలుపొందారు. 2019లో హేమమాలినికి పోటీగా మరో 12 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున మహేశ్ పాఠక్, రాష్ట్రీయ లోక్‌దళ్ తరఫున కున్వర్ నరేంద్ర సింగ్, స్వతంత్ర జనతారాజ్ పార్టీ ఓం ప్రకాశ్ బరిలో నిలిచారు. హేమ మాలిని మాత్రం ఘన విజయం సాధించింది. 2014లో కూడా హేమమాలిని ఇక్కడ గెలిచారు. ఈ క్రమంలో మధుర లోక్‌సభ స్థానానికి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలినిని పోటీకి దింపింది.