Ashwini Vaishnav | ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ యూఆర్ఎల్స్ను బ్లాక్ చేశాం : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnav | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రభుత్వం 1,400కిపైగా డిజిటల్ మీడియా యూఆర్ఎల్ (URL)లను బ్లాక్ చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభకు తెలిపారు.
Ashwini Vaishnav | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రభుత్వం 1,400కిపైగా డిజిటల్ మీడియా యూఆర్ఎల్ (URL)లను బ్లాక్ చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభకు తెలిపారు. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న సోషల్ మీడియా ఖాతాలు ఈ యూఆర్‌ఎల్స్‌తో తప్పుదారి పట్టించేలా, భారత్ వ్యతిరేక కంటెంట్ వ్యాప్తి చేస్తున్నాయని చెప్పారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు భారత్ వెలుపలి నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లు పేర్కొన్నారు. అందుకే 1400కిపైగా యూఆర్ఎల్స్లను బ్లాక్ చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించిందని చెప్పారు. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతను కాపాడుకునేందుకు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ చర్య తీసుకున్నట్లు వైష్ణవ్ చెప్పారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని ప్రభుత్వం మీడియాకు సూచించిందని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా వివిధ విభాగాలు, ఏజెన్సీల మధ్య సమన్వయంతో ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఇది 24గంటలు పని చేస్తూ మీడియాకు తాజా సమాచారాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రంటోల్ రూమ్‌లో సైన్యం, నేవీ, వైమానిక దళం ప్రతినిధులు, ప్రభుత్వ మీడియా విభాగాల అధికారులు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు ఉన్నారన్నారు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే పోస్ట్‌లు, హ్యాల్స్ను గుర్తించినట్లు చెప్పారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఉన్న ఫ్యాక్ట్ చెక్ టీమ్ విభాగం సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తల వనరులను పర్యవేక్షించిందని, ఫేక్ ఫొటోలు, ఎడిట్ వీడియోలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు, ఆపరేషన్, ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలకు వ్యతిరేకంగా కంటెంట్‌ను గుర్తించిందని వైష్ణవ్ చెప్పారు. ఈ యూనిట్ ఫేక్ న్యూస్‌ను ఎప్పటికప్పుడు తిప్పికొట్టిందని.. సరైన సమాచారాన్ని అందించిందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

