సహజీవనంలోని జంటలకు.. భార్యాభర్తల హక్కులు

- వారు రక్షణ కోరితే కల్పించాలి
- పంజాబ్-హర్యానా హైకోర్టు
చండీగఢ్, మే 21: చట్టబద్ధంగా వివాహం చేసుకొన్నవారికి లభించే అన్ని హక్కులు సహజీవనంలో ఉన్న జంటకు కూడా వర్తిస్తాయని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రేమలో ఉన్న ఇద్దరు సహజీవనం చేస్తూ రక్షణ కోరితే కల్పించాల్సిందే అని స్పష్టంచేసింది. హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన ఓ జంట.. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధీర్ మిట్టల్ విచారణ జరిపారు. ‘జీవితభాగస్వామిని ఎంచుకోవడం రాజ్యాంగపరమైన హక్కు. పెండ్లి చేసుకోనంత మాత్రాన వారి జీవితానికి, స్వేచ్ఛకు భంగం కలగనివ్వకూడదు’ అని స్పష్టం చేశారు. అయితే ఇదే హైకోర్టులోని మరో ధర్మాసనం.. ఈ నెలలోనే ఇలాంటి నేపథ్యం ఉన్న రెండు కేసుల్లో భిన్నమైన తీర్పులు ఇవ్వడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

