Lieutenant General Dhiraj Seth: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ రేపు బాధ్యతల స్వీకరణ
Lieutenant General Dhiraj Seth: భారత ఆర్మీ చీఫ్‌గా మంగళవారం లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బుధవారం భారత వైమానిక దళ వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ సేథ్.. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటారు.
న్యూఢిల్లీ: భారత మిలిటరీకి కొత్త టాప్ ఆఫీసర్లు రానున్నారు. భారత ఆర్మీ చీఫ్‌గా మంగళవారం లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ (Lieutenant General Dhiraj Seth)బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బుధవారం భారత వైమానిక దళ వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారతీయ రక్షణ వ్యవస్థలో ఇటీవలే కొత్తగా ఇద్దరు ఉన్నత పదవులను అలంకరించిన విషయం తెలిసిందే. చీఫ్ ఆఫ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, నేవీ చీఫ్‌గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్.. బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ సేథ్.. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటారు. ధీరజ్ సేథ్.. ఆర్మర్డ్ కాప్స్ చెందిన వ్యక్తి. ఆయన 1986లో ఆర్మీలో కమిషన్ అయ్యారు. మూడు దశాబ్ధాల తర్వాత ఆర్మర్డ్ కాప్స్‌కు చెందిన ఆఫీసర్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. 1997లో చివరిసారి ఆర్మర్డ్ కాప్స్‌కు చెందిన జనరల్ రాయో చౌదరీ ఆర్మీ చీఫ్‌గా చేశారు. లెఫ్టినెంట్ జనరల్ సేథ్‌కు ఆపరేషనల్, స్ట్రాటజిక్, క్యాపబులిటీ డెవలప్మెంట్, ఇన్స్టిట్యూషనల్ డొమెయిన్స్లో విస్తృతమైన అనుభవం ఉన్నది.
జూలై ఒకటో తేదీన ఐఏఎఫ్ వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఐఏఎఫ్ చీఫ్‌గా ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో సమానంగా ఉన్న సీనియన్ అధికారి ఆయన. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయన పదవీకాలం పూర్తి కానున్నది. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా దీక్షిత్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ నేతృత్వంలో త్రివిధ దళాలకు చెందిన సీఐఎస్సీ పనిచేస్తుంది. ఆయన ఫైటర్ పైలట్ కూడా. బెంగుళూరులోని ఫ్లయిట్ టెస్ట్ స్క్వాడ్రన్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా చేశారు.
ఆర్మీ చీఫ్‌గా సేథ్ రావడంతో.. వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ ఆ బాధ్యతలను స్వీకరిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

