Liberian Cargo Ship | కొచ్చి, మే 25: లైబీరియాకు చెందిన భారీ నౌక ‘ఎంఎస్సీ’ కేరళ తీరంలో నీట మునిగింది. దీంతో తీరం వెంబడి పెద్ద మొత్తంలో చమురు, ఇతర రసాయనాలు లీక్ అయ్యే ప్రమాదముందని కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
ముఖ్యంగా మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలోకి వెళ్లరాదని, చేపలవేట చేపట్టరాదని హెచ్చరికలు జారీచేసింది. నౌకలో 640 కంటెయినర్లు ఉండగా, 13 కంటెయినర్లలో ప్రమాదకర రసాయనాలు, 12 కంటెయినర్లలో కాల్షియం కార్బైడ్ ఉన్నట్టు పేర్కొంది.