బెంగళూరు, మే 21: కర్ణాటకలో సెక్స్ స్కాండల్ కేసును ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్టు రాష్ట్ర మంత్రి జీ పరమేశ్వర చెప్పారు. లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటికే న్యాయస్థానం అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసిందని, ఈ క్రమంలో వెంటనే అతడి దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.