ఖాదీని ‘జాతీయ వస్త్రాలు’గా పరిగణించి ధరిద్దాం : వెంకయ్యనాయుడు
ఖాదీ వస్త్రాలను ‘జాతీయ వస్త్రాలు’గా భావించి గర్వంగా ధరించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాలని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ఖాదీ వస్త్రాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు వివిధ రంగాల ప్రముఖులు...

న్యూఢిల్లీ : ఖాదీ వస్త్రాలను ‘జాతీయ వస్త్రాలు’గా భావించి గర్వంగా ధరించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాలని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. ఖాదీ వస్త్రాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు వివిధ రంగాల ప్రముఖులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) నిర్వహించిన ‘ఖాదీ ఇండియా క్విజ్ పోటీ’లను ఉపరాష్ట్రపతి ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఈ పోటీలు మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన మూలాల్లోకి తిరిగి వెళ్ళేందుకు చక్కటి మార్గమని అన్నారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని దేశభక్తి, ధైర్యం, స్థితిస్థాపకతల వీరగాధగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు. మానవ చరిత్రలో భారత స్వాతంత్య్ర సంగ్రామం అసమానమైన గొప్ప అంశంగా పేర్కొన్నారు. మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉన్నదన్న ఆయన, ముఖ్యంగా మన మాతృభూమి ప్రయోజనాలను అన్నిటికంటే గొప్పవిగా భావించే స్ఫూర్తి వారి నుంచి లభిస్తుందని తెలిపారు.
గడచిన ఏడేండ్లలో ఖాదీ అభివృద్ది పట్ల జరుగుతున్న కార్యక్రమాలపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. వృద్ధిని వేగవంతం చేసిన ప్రభుత్వం, కేవీఐసీతోపాటు భాగస్వాములందరినీ ప్రశంసించారు. ఖాదీకి విద్యుత్ తప్ప ఎలాంటి ఇతర ఇంధనాల అవసరం లేదని, ఖాదీ తయారీలో ఏవిధమైన కర్బన ఉద్గారాలు విడుదల కావని పేర్కొన్నారు. యూనిఫామ్స్ కోసం ఖాదీని విస్తృతంగా వినియోగించాలని విద్యా సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూక్ష్మ. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రి నారాయణ్ రాణె, సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ, కార్యదర్శి బీబీ స్వైన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యక్తిని హెలికాప్టర్‌కు కట్టి తిప్పారు.. వీడియో వైరల్
ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. కారణమేంటంటే..?
భారత్‌లో పెరిగిన ఆర్-వ్యాల్యూ.. వేగంగా కొవిడ్ వ్యాప్తి
20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ చేరాడు.. ఎవరంటే..?
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి ఆలయం ధ్వంసం
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

