Leopard | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో చిరుత (Leopard) హల్చల్ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్ గది (hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది. దాదాపు రెండు గంటల పాటు చిరుత ఆ గదిలోనే గడిపింది.
గురువారం ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి చిరుత ప్రవేశించింది. అయితే, ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుతను చూసిన హోటల్ యాజమాన్యం ఆ గదికి బయట నుంచి తాళం వేసి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా, చిరుత గదిలో ఉన్న దృశ్యాలను అక్కడే ఉన్న సిబ్బంది తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
जयपुर के हैरिटेज होटल में घुसा लेपर्ड, टूरिस्ट होटल छोड़कर बाहर भागे, वीडियो हो रहा वायरल.#Jaipur #Leopard #viralvideo pic.twitter.com/2oIKzlIMMn
— Nidhi solanki🇮🇳 (@iNidhisolanki) January 19, 2024
Also Read..
Delhi | ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలు సహా ఆరుగురు సజీవదహనం
Lord Ram | దేశంలో రాముని పేరుతో 343 రైల్వే స్టేషన్లు.. సర్వాంగ సుందరంగా అలంకరించనున్న రైల్వే శాఖ
West Indies Cricket | వెస్టిండీస్ బోర్డుకు పెద్ద షాక్.. క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆ నలుగురు