న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష ఐక్య కూటమి ఘన విజయం సాధించింది. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్ కలిసి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి.
ఏఐఎస్ఏ అభ్యర్థిని అదితి మిశ్రా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవిని ఎస్ఎఫ్ఐకి చెందిన కే గోపిక దక్కించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా డీఎస్ఎఫ్ అభ్యర్థి సునీల్ యాదవ్, సంయుక్త కార్యదర్శిగా ఏఐఎస్ఏ అభ్యర్థి డానిష్ అలీ ఎన్నికయ్యారు.