బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహస్యం చేస్తూ కర్ణాటకకు చెందిన హులికుంతే మూర్తి అనే ఓ లెక్చరర్ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టాడు. ‘చంద్రయాన్-3 ఈసారి కూడా విఫలమవుతుంది’ అని పేర్కొంటూ ‘తిరుపతి నామం’ పదబందాన్ని తన ట్విట్టర్ పోస్టులో రాశారు. దీనిపై కర్ణాటక ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం అధికారులు తీవ్రంగా స్పందించారు. పోస్టుపై వివరణ ఇవ్వాలని మూర్తికి నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా లెక్చరర్ మూర్తి తన పోస్టుపై విమర్శలు ఎదుర్కొంటున్నారు.