న్యూఢిల్లీ: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ ఇవాళ ఎన్కౌంటర్(Encounter) అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ కొత్వాలి ఏరియాలో ఆ ఎన్కౌంటర్ జరిగింది. యూపీ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. షార్ప్‌షూటర్ నవీన్ కుమార్‌పై పలు కేసులు ఉన్నాయి. అతనిపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ కింద కూడా అతనిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు ఆఫీసర్ వెల్లడించారు.
హాపుర్ కొత్వాలి ఏరియాలో నేరగాళ్లతో నోయిడా యూనిట్ ఎస్టీఎఫ్, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు ఏడీజీపీ అమితాబ్ యశ్ తెలిపారు. ఆ కాల్పుల్లో కుమార్‌కు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతను మృతిచెందినట్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
ఘజియాబాద్ జిల్లాలోని లోని గ్రామ నివాసితుడైన కుమార్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో యాక్టివ్ షార్ప్‌షూటర్‌గా ఉన్నాడు. గ్యాంగ్ సభ్యులైన హసిమ్ బాబాతో చాలా సన్నితంగా కలిసి పనిచేసినట్లు ఏడీజీపీ తెలిపారు. ఢిల్లీ, యూపీల్లో మొత్తం 20కి పైగా కేసులు అతనిపై నమోదు అయినట్లు పోలీసు అధికారి చెప్పారు.
2008లో ఢిల్లీలో ఆర్మ్స్ యాక్టు ప్రకారం సీమాపురి పోలీసు స్టేషన్లో కుమార్‌పై కేసు నమోదు అయ్యింది. 2009లో సాహిబాబాద్ ఏరియాలో ఓ మర్డర్ చేశాడతను. 2021లో గ్యాంగ్‌స్టర్ చట్టం కింద యూపీలో అతనిపై కేసు బుక్కైంది.