ఇస్లామాబాద్ : ఆపరేషన్ సింధూర్ దాడి వల్ల పాకిస్థాన్లోని బహవల్పుర్లో ఉన్న జైషే ఉగ్రవాదుల ప్రధాన కార్యాయం ధ్వంసమైనట్లు కొన్ని రోజుల క్రితం జేషే మహమ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు చెందిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) ఉగ్రసంస్థ కూడా ఓ వీడియోను పోస్టు చేసింది. భారత సైన్యం జరిపిన దాడిలో ముర్దిక్లో ఉన్న లష్కరే తోయిబా ఉగ్ర స్థావరం ధ్వంసమైనట్లు ఆ ఉగ్ర సంస్థ కమాండర్ ఒకరు తెలిపారు.
లష్కరే కమాండ్ ఖాసిమ్.. ఓ కూలిన ఇంటి వద్ద నిలుచుని మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ముర్దిక్లో శిథిలమైన మర్కాజ్ ఈ తాయిబా క్యాంపు వద్ద అతను తన బాధను పంచుకున్నాడు. ముజాహిదిన్ ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందినట్లు అతను స్పష్టం చేశాడు. మర్కాజ్ తాయిబా ముందు నిలుచున్నానని, ఆపరేషన్ సింధూర్ దాడిలో ఇది ధ్వంసమైందని, మళ్లీ దీన్ని నిర్మిస్తామని, మరింత పెద్దగా కడుతామని, ముజాహిద్దీన్లో ఎక్కువ మంది ఇక్కడే శిక్షణ పొందారని, వాళ్లు విజయం సాధించారని లష్కరే కమాండర్ పేర్కొన్నారు.
దైరా-ఈ-సూపా కార్యక్రమం కింద యువత తమ దళంలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. పంజాబ్ ప్రావిన్సులోని నంగల్ సహదాన్లో 2000 సంవత్సరంలోమార్కాజ్ తాహిబాను నిర్మించారు. వరద సహాయం పేరుతో లష్కరే తోయిబా నిధులను సమీకరిస్తున్నది. హఫీజ్ సయిద్ నేతృత్వంలో ఈ ఫండ్ కలెక్షన్ జరుగుతున్నట్లు కొన్ని సంస్థల ద్వారా తెలుస్తోంది.
🚨 🇵🇰👺 After Jaish commander ilyas kashmiri now Lashkar-e-Taiba Commander Qaasim has torn apart Pakistan’s lies on Muridke terror camps.
👉 Standing in front of the demolished Markaz E Taiba camp, which destroyed in #OperationSindoor, he admits that many terrorists… pic.twitter.com/S80p9wLSFy
— OsintTV 📺 (@OsintTV) September 19, 2025