Land for Job Scam | ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో లాలూ ప్రసాద్, రబ్రీదేవి సహా 14 మందికి సమన్లు..
Land for Job Scam | ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం (Land for Job Scam) లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (former Union Minister Lalu Prasad Yadav), బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) సహా మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi's Rouse Avenue Court) సోమవారం సమన్లు జారీ చేసింది.
Land for Job Scam | ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం (Land for Job Scam)లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (former Union Minister Lalu Prasad Yadav), బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) సహా మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi’s Rouse Avenue Court) సోమవారం సమన్లు జారీ చేసింది. నిందితులపై సీబీఐ (CBI) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగిణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు సమన్లు జారీ చేసింది. 2004-2009 మధ్య యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రైల్వే రిక్రూట్మెంట్లో కుంభకోణం జరిగింది.
దరఖాస్తుదారుల నుంచి భూములు, ప్లాట్లు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై కేసు నమోదైంది. దరఖాస్తుదారుల నుంచి తీసుకున్న భూములను రబ్రీదేవి, మిసా భారతి పేరిట తీసుకున్నట్లుగా ఆరోపించింది. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన పవన్ బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లా సైతం రైల్వే రిక్రూట్మెంట్కు సంబంధించి మరో కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో విజయ్ సింగ్లా సహా 10 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విజయ్ సింగ్లా కూడా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. లాలూపై ఐఆర్సీటీసీ కేసు సైతం ఉన్నది. రైల్వే రిక్రూట్మెంట్కు ఇది భిన్నమైన కేసులు. 2004లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో స్కామ్‌కు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి, ఆ సమయంలో రైల్వే బోర్డు పూర్తిగా రైల్వే క్యాటరింగ్, రైల్వే హోటళ్ల సేవలను ఐఆర్సీటీసీకి అప్పగించింది. ఈ సమయంలో రాంచీ, పూరీల్లోని బీఎన్ఆర్ హోటల్ నిర్వహణ, అభివృద్ధి కోసం కొనసాగుతున్న టెండర్లలో అవకతవకలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. ఈ టెండర్ 2006లో ఒక ప్రైవేట్ హోటల్ సుజాత హోటల్ ద్వారా అందుకుంది. సుజాత హోటల్స్ యజమానులు లాలూ యాదవ్ కుటుంబానికి పాట్నాలో మూడు ఎకరాల భూమిని ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో లాలూ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు.
Delhi's Rouse Avenue Court issued summons against former Union min Lalu Prasad Yadav,Rabri Devi & 14 others in connection with alleged land-for-job-scam. Court issued summons to the accused persons for March 15 after taking cognizance of the chargesheet filed by CBI against them. pic.twitter.com/rETrLPc94y
— ANI (@ANI) February 27, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

