Watch: ‘పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’.. రాహుల్‌కు లాలూ సలహా
get married | ‘పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు.
పాట్నా: ‘పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ‘పెళ్లి చేసుకో.. మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. 53 ఏళ్ల రాహుల్ గాంధీ నవ్వుతూ దీనికి బదులిచ్చారు. ‘ఇప్పుడు మీరు దాని (పెళ్లి) గురించి చెప్పారు. ఇక అది జరుగుతుంది’ అని అన్నారు.
కాగా, ‘ఇంకా ఆలస్యం ఉందా? తన మాట వినడం లేదని మీ అమ్మగారు నాతో చెప్పారు’ అని లాలూ వ్యాఖ్యానించారు. ‘మా మాట విను.. పెళ్లి గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వు’ అని అన్నారు. అలాగే పెళ్లి చేసుకోవాలని గతంలో తాను ఇచ్చిన సలహాను రాహుల్ గాంధీ పాటించలేదని లాలూ తెలిపారు. తన సలహా పాటించి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండేవారని అన్నారు. పెళ్లిని ఇంకా ఆలస్యం చేయవద్దని రాహుల్ గాంధీకి సూచించారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొన్న నేతలంతా నవ్వుకున్నారు.
మరోవైపు, ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. సరైన అమ్మాయి నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అయితే ఎలాంటి అర్హతలు ఉండాలని ప్రశ్నించగా ‘ప్రేమించే గుణం, తెలివైన అమ్మాయి’ అయితే చాలని అన్నారు. అలాగే గత ఏడాది డిసెంబర్లో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రాహుల్ గాంధీ తన పెళ్లి విషయంపై మాట్లాడారు. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లక్షణాలున్న భాగస్వామిని కోరుకుంటున్నట్లు చెప్పారు.
#WATCH | "You didn't listen to my advice earlier. You should have married. It is not too late even today. You must get married," says RJD leader Lalu Yadav to Rahul Gandhi during opposition leaders' press meet in Patna pic.twitter.com/T4HomIpZo5
— ANI (@ANI) June 23, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

