JDU | తప్పుకున్న లలన్ సింగ్.. జేడీ(యూ) చీఫ్‌గా నితీష్ కుమార్
జేడీ(యూ) చీఫ్ పదవికి లలన్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. ఇక జేడీ(యూ) (JDU ) చీఫ్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.
న్యూఢిల్లీ : జేడీ(యూ) చీఫ్ పదవికి లలన్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. పట్నాలో జరిగిన పార్టీ సమావేశాల్లో ఆయన జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. ఇక జేడీ(యూ) (JDU ) చీఫ్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జేడీయూలో ముసలం పుట్టింది.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్ తన పదవికి రాజీనామా చేయడం జేడీ(యూ) వర్గాల్లో కలకలం రేపింది. సీఎం నితీశ్ వైఖరి నచ్చకనే లలన్‌సింగ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం సాగినా ఇవి వదంతులేని లలన్ సింగ్ తోసిపుచ్చారు.
ఇక ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు నితీశ్ సన్నిహితం కావడం, బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో దోస్తీ కారణంగా లలన్‌సింగ్ అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. లలన్‌సింగ్ రాజీనామా చేశాక ఆ బాధ్యతలను నితీశ్‌కుమార్ స్వీకరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే నితీశ్, లలన్‌సింగ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బీజేపీనే వదంతులు సృష్టిస్తున్నదని పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ పేర్కొన్నారు.
Read More :
Shots fired | కెనడాలో హిందూ వ్యాపారి ఇంటిపై కాల్పుల మోత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

