Shots fired | కెనడాలో హిందూ వ్యాపారి ఇంటిపై కాల్పుల మోత
Shots fired | కెనడా (Canada)లోని ఓ హిందూ వ్యాపారి (Hindu businessman) ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
Shots fired | కెనడా (Canada)లోని ఓ హిందూ వ్యాపారి (Hindu businessman) ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే (Surrey)లో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
సుర్రే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ అధ్యక్షుడైన (Lakshmi Narayan Mandir president) సతీశ్ కుమార్ పెద్ద కుమారుడిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. ఆ ఇంటిపై సుమారు 14 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఇల్లుమాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీసులు వివరించారు. సమాచారం అందుకున్న సుర్రే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
కాగా, ఇటీవలే కాలంలో కెనడాలోని హిందూ కమ్యూనిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలను సైతం టార్గెట్ చేస్తున్నారు. పలు చోట్ల ఆలయాలను ధ్వంసం చేసిన వంటి ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ దాడుల వెనుక ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలతో స్థానికంగా ఉంటున్న హిందువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Storm Gerrit | బ్రిటన్ను వణికిస్తున్న గెరిట్ తుఫాను.. ల్యాండింగ్ సమయంలో కుదుపులకు లోనైన విమానం
Donald Trump | ట్రంప్‌కు మరో షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం
kids sleeping | కదులుతున్న కారుపై నిద్రిస్తున్న చిన్నారులు.. వీడియో వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

