Today History: ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం పలుకగానే వెంటనే స్ఫురణకు వచ్చే వ్యక్తి.. మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా ఉన్న శాస్త్రి.. తాష్కెంట్లో అనుమానాస్పద రీతిలో 1966 లో సరిగ్గా ఇదే రోజున కన్నుమూశారు. ఆయన మరణం వెనక ఉన్న మిస్టరీ ఇనాటికీ ఇంకనూ వీడకపోవడం విశేషం. శాస్త్రీజీ మరణం వెనక కుట్ర ఉన్నదని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం అనేక దశాబ్దాల పాటు పూర్తి అంకితభావంతో పనిచేసిన శాస్త్రీజీ.. ఆయన అద్భుతమైన సమర్థత, సమగ్రత, వినయ స్వభావానికి గుర్తుండిపోతారు.
లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న మొఘల్‌సరాయ్‌లో జన్మించారు. అక్కడే ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇంటర్ కాలేజీలో, వారణాసిలోని హరీష్ చంద్ర హైస్కూల్లో చదువుకున్నారు. 1926లో కాశీ విద్యాపీఠం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్ నుంచి ప్రేరణ పొంది.. 1920 లో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేండ్లకు పైగా జైలుశిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శాస్త్రీజీ.. 1946 వరకు జైలులోనే ఉన్నారు. నెహ్రూ ఆకస్మిక మరణానంతరం, 1964 జూన్ 9 న శాస్త్రి రెండవ ప్రధానమంత్రి అయ్యారు. పాల ఉత్పత్తిని పెంచడానికి శ్వేత విప్లవం, పంటల అభివృద్ధికి హరిత విప్లవం చేపట్టారు.
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకనూ వీడలేదు. 1965లో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ తర్వాత, సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు శాస్త్రి వెళ్లారు. జనవరి 10 న పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో తాష్కెంట్ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం అనంతరం కేవలం 12 గంటల తర్వాత జనవరి 11న తెల్లవారుజామున 1:32 గంటలకు అతను మరణించాడు. ఆయన మరణంపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరణానికి అరగంట ముందు వరకు శాస్త్రి పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్యులు ఇంట్రా మస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చిన 15 నుంచి 20 నిమిషాల్లో ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు.
2015: క్రొయేషియా తొలి మహిళా ప్రధానమంత్రిగా కొలిండా గ్రుబెర్ కితారోవి ఎన్నిక
2009: 66వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్
1973 : భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ జననం
1954: నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి జననం
1942: రెండవ ప్రపంచ యుద్ధంలో కౌలాలంపూర్‌ను స్వాధీనం చేసుకున్న జపాన్
1922: తొలిసారి డయాబెటిక్ రోగికి ఇచ్చిన ఇన్సులిన్
1569: ఇంగ్లాండ్‌లో మొదటి లాటరీ ప్రారంభం
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..