Afsa Ansari: పరారీలో లేడీ డాన్.. భర్త అంత్యక్రియలకు హాజరుకాని అఫ్సా అన్సారీ
Afsa Ansari: యూపీలో ఇవాళ ముక్తార్ అన్సారీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పరారీలో ఉన్న ముక్తార్ అన్సారీ భార్య, లేడీ డాన్ అఫ్సా అన్సారీ కోసం ఆ సమయంలో పోలీసులు ఎదురుచూశారు.యూపీ పోలీసుల లేడీ డాన్ లిస్టులో అఫ్సా అన్సారీ ఉన్నది.
చండీఘడ్: యూపీలో ఇవాళ ముక్తార్ అన్సారీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఘాజిపూర్లోని తన పూర్వీకుల శ్మశానవాటికలోనే అన్సారీకి తుది వీడ్కోలు పలికారు. అయితే పరారీలో ఉన్న ముక్తార్ అన్సారీ భార్య, లేడీ డాన్ అఫ్సా అన్సారీ(Afsa Ansari) కోసం పోలీసులు ఆ సమయంలో ఎదురుచూశారు. యూపీ పోలీసుల లేడీ డాన్ లిస్టులో అఫ్సా అన్సారీ ఉన్నది. అయితే శశ్మానవాటిక వద్దకు ఆమె రాలేదు. కాలీ బాగ్ శ్మశానవాటికలో ముక్తార్ అన్సారీ మృతదేహాన్ని ఖననం చేశారు. తల్లి సమాధి పక్కనే అతన్ని పూడ్చారు. భారీ సంఖ్యలో శ్మశానవాటికకు ప్రజలు చేరుకున్నారు. అన్సారీ సోదరుడు, కుమారుడు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పలు కేసుల్లో అఫ్సా వాంటెడ్లో ఉన్నది. గ్యాంగ్స్టర్ యాక్టు కింద కూడా ఆమెపై కేసులు ఉన్నాయి. దాదాపు ఏడాది నుంచి ఆమె పరారీలో ఉన్నది. గృహిణిగా చెప్పుకునే ఆమెపై మూడు కీలకమైన కేసులు ఉన్నాయి. దాంట్లో రెండు భూకబ్జా కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2022, జనవరి 31వ తేదీన గ్యాంగ్స్టర్ చట్టం కింద దక్షిణ్ తోలా పోలీసు స్టేషన్లో ఆమెపై కేసు నమోదు అయ్యింది.
గ్యాంగ్స్టర్ నుంచి పొలిటీషియన్గా మారి, ఏకంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి, గురువారం రాత్రి గుండెపోటుతో ముఖ్తార్ అన్సారీ మరణించాడు. ఇవాళ ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

