12 ఏళ్లు దలైలామా సెక్యూర్టీలో జాగిలం.. వేలంలో రూ.1550కి అమ్ముడుపోయింది
Dalai Lamas security dog: దలైలామా సెక్యూర్టీ వద్ద 12 ఏళ్లు సేవ చేసిన లాబ్రడార్ జాతికి చెందిన జాగిలాన్ని అమ్మేశారు. ఆర్మీలో శిక్షణ పొందిన డోకోను అతి తక్కువ ధరకు వేలం వేశారు. హిమాచల్ స్థానికుడు దాన్ని సొంతం చేసుకున్నాడు.
ధర్మశాల: దలైలామా సెక్యూర్టీలో గత 12 ఏళ్లుగా ఉన్న జాగిలం డోకోను అమ్మేశారు. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు నిర్వహించిన వేలంలో ఆ శునకం కేవలం రూ.1550కి అమ్ముడుపోయింది. దలైలామా టెంపుల్ పక్కన ఉన్న శివాలయంలో ఇవాళ ఆ వేలం జరిగింది. వేలంలో అయిదారుగురు పాల్గొన్నారు.
ప్రస్తుతం డోకో వయసు 13 ఏళ్లు. హమీపూర్ జిల్లాకు చెందిన అజయ్ పర్మార్ దాన్ని కొనుగోలు చేశాడు. నిజానికి ఇండియన్ ఆర్మీ వద్ద ఉన్న లాబ్రడార్ డోకోను 2010లో హిమాచల్ పోలీసులు 1.23 లక్షలకు కొనుగోలు చేశారు. పేలుడు పదార్ధాలను గుర్తించడంలో ఆర్మీ వద్ద ఆ శునకం శిక్షణ పొందింది. స్నిఫింగ్లో అది శిక్షణ తీసుకున్నది.
ఫిబ్రవరి ఏడో తేదీన డోకో సేవలు ముగిశాయి. ఆ జాగిలం సర్వీసు నుంచి రిటైర్ అయ్యింది. అయితే దానికి వినికిడి శక్తి తగ్గినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. డోకో వేలాన్ని అడ్డుకునేందుకు ఓ ఎన్జీవో ప్రయత్నించింది. 12 ఏళ్లు దలైలామా సెక్యూర్టీలో ఉన్న ఆ జాగిలాన్ని ఎలా అమ్ముతున్నారని ఆ ఎన్జీవో ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

