కేంద్ర మంత్రి మురుగన్ రాజీనామా
కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ మంగళవారం రాజీనామా చేశారు. సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి అనుమతించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
- పార్టీలో క్షేత్రస్థాయిలో పని చేయాలనుకుంటున్నట్టు వెల్లడి
- మళ్లీ తెరపైకి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో బీజీపీ పటిష్ఠతకు తాను క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ వద్ద మంత్రిగా పనిచేయడం తనకు జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని పటిష్ఠం చేసేందుకు కార్యకర్తలతో పూర్తిస్థాయి సమయం పనిచేయాలని నిర్ణయించానన్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రాజీనామాతో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీపావళికి ముందే ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కనీసం అరడజను పోస్టులు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

