Monalisa Bhosle : కుంభమేళాలో వైరల్‌గా మారిన మోనాలిసా ఆ తర్వాత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మోనాలిసాను ఇటీవల ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అతడు మోనాలిసాను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేశాడని ఆమె కుటుంబం ఆరోపించింది. అంతేకాదు.. కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. అలాగే, ఆమె మైనర్ అని, పెళ్లి వయసు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
వీరి వివాహాన్ని సోషల్ మీడియాలో లవ్ జిహాద్‌గా పేర్కొన్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారి జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. దీంతో మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై కిడ్నాప్ సహా పలు అంశాలపై కేసులు నమోదయ్యాయి. ఆమె తల్లిదండ్రులు అతడిపై పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేశారు. ఈ విషయంలో ఆమె మైనరా, మేజరా అనేది తేలాల్సి ఉంది. అధికారిక డాక్యుమెంట్ల ప్రకారం.. మోనాలిసా 2009లో పుట్టినట్లుగా ఉంది. దీని ప్రకారం ఆమె మైనర్. అయితే, ఆ ధృవీకరణ పత్రాలు తప్పని, తాను జనవరి 1, 2008న పుట్టానని మోనాలిసా పేర్కొంది. దీనికి సంబంధించి ఆమె ఇండోర్ హైకోర్టును ఆశ్రయించింది.
తన భర్తపై దాఖలైన కిడ్నాప్ కేసును కొట్టేయాలని పిటిషన్లో పేర్కొంది. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. మోనాలిసాకు సంబంధించిన ధృవపత్రాల్లో తప్పు ఉండటంతో ఫర్మాన్ ఖాన్, మోనాలిసా భోస్లే వివాహానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయ. మోనాలిసాను మైనర్‌గా ఉండగానే అతడు వివాహం చేసుకున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఇద్దరూ కొంతకాలం క్రితం ఒక సినిమా షూటింగ్ సందర్భంగా కలుసుకున్నారు. ఆ తర్వాత తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.
ఈ అంశంలో నిజాలు తేల్చాల్సిందిగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎన్సీఎస్టీ) కూడా విచారణ జరుపుతోంది.ఈ విషయంలో ఆమె భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. తాజా డాక్యుమెంట్ల ఆధారంగా మోనాలిసా మైనర్ అని తేలితే, ఫర్మాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.