Bipin Rawat Ashes: బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని గంగానదిలో కలిపిన కుమార్తెలు
Bipin Rawat Ashes: ఈ నెల 8న హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి నిమిజ్జనం చేశారు.

హరిద్వార్: ఈ నెల 8న హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని ( Bipin Rawat Ashes ) వారి కుమార్తెలు క్రితిక, తరిణి నిమిజ్జనం చేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పుణ్యక్షేత్రం వద్ద శ్రాద్ధ కర్మలు నిర్వహించి చితాభస్మాన్ని గంగానదిలో కలిపేశారు. కుమార్తెలిద్దరూ తమ తల్లిదండ్రుల చితాభస్మాలుంచిన పాత్రలను పుష్పాలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు.
జనరల్ బిపిన్ రావత్ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి కొండల్లో జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హెలిక్యాప్టర్ సూలూరు నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా కూనూరు సమీపంలో కుప్పకూలింంది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మంది మరణించారు. ఒకరు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kritika and Tarini, the daughters of #CDSGeneralBipinRawat and Madhulika Rawat immerse the ashes of their parents in Haridwar, Uttarakhand. #TamilNaduChopperCrash pic.twitter.com/r1IGJ2X1m5
— ANI (@ANI) December 11, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

