King Cobra Mongoose Fight | కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. దీని విషం కొద్ది నిమిషాల్లోనే మనిషి ప్రాణాలను తీస్తుంది. అలాంటి విషపూరితమైన పాముతో కొట్లాడే జీవి ఒకటి ఉన్నది. అదే ముంగీస. పాములు, ముంగీసలు కొట్లేడే వీడియోలు చూసే ఉంటారు. ఇలాంటిదే ఓ వీడియో వైల్డ్ యానిమలియా ఖాతాలో పోస్ట్ చేయగా.. వైరల్గా మారింది. నీటి మడుగులో కోబ్రాను చూసిన ముంగీస దానిపై దాడికి ప్రయత్నించింది. పాము సైతం బుసలు కొడుతూ కాటువేస్తూనే తప్పించుకునేందుకు యత్నించింది.
ఇలా కొద్దిసేపు నాగుపాము – ముంగీస పోట్లాడాయి. కోబ్రా తనను తాను ముంగీస నుంచి కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. పాము ఎంత ప్రయత్నించినా ముంగీస వెంటాడింది. వీటి పొట్లాటపై పలువురు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. పాము ఇంకా డైవ్ చేయడం, ఊపిరి బిగపట్టడం నేర్చుకోవాలని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
కెమెరా మెన్ ఫైర్డ్ అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. వీడియోను 2లక్షల మంది వీక్షించగా.. 13వేలకుపైగా లైక్స్ వచ్చాయి. కింగ్ కోబ్రా – ముంగీస మధ్య జరిగో పోరులో సాధారణంగా 75 నుంచి 80శాతం వరకు ముంగీసదై పైచేయి. ముంగీసలు నాగుపాములు తదితర విషపూరితమైన వాటిని కొరికి తింటాయి.