ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీపై ఖలిస్థాన్ (Khalistan) జెండాలు దర్శనమిచ్చాయి. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై దుండగులు ఖలిస్థాన్ జెండాలను వేలడాదీశారు. ఆదివారం ఉదయం గుర్తించిన పోలీసులు వాటిని తొలగించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాతగాని, ఆదివారం తెల్లవారుజామున గాని దుండగులు ఈ పనిచేసి ఉంటారని కాంగ్రా ఎస్పీ ఖుషల్ శర్మ చెప్పారు. విధాన సభ గేటుకు ఉన్న ఖలిస్థాన్ జెండాలను తొలగించామని వెల్లడించారు. ఇది పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థకు చెందిన నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను శిమ్లాలో ఖలిస్థాన్ జెండాలు ఎగురవేయాలని గత నెల పిలుపునిచ్చాడు.
#WATCH Khalistan flags found tied on the main gate & boundary wall of the Himachal Pradesh Legislative Assembly in Dharamshala today morning pic.twitter.com/zzYk5xKmVg
— ANI (@ANI) May 8, 2022