ఖాదీ గురించి గొప్పలు.. జాతీయ జెండాకు మాత్రం చైనీస్ పాలిస్టర్
ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మాటలకు, చేతలకు పొంతనే ఉండదని ఎద్దేవా చేశారు. ప్రధాని శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఖాదీ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న, స్వావలంభన భారత్ కలలు సాకారం కావడానికి ఖాదీ ఒక ఆదర్శక వనరు అని వ్యాఖ్యానించారు.
ప్రధాని వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఖాదీని వినియోగించాలని గొప్పలు చెబుతూనే జాతీయ జెండాకు మాత్రం చైనీస్ పాలిస్టర్‌ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ మాటలకు, చేతలకూ ఎప్పుడూ పొంతన కుదరదని దుయ్యబట్టారు. ఫ్లాగ్ కోడ్ సవరణలు చేసినప్పుడే కేంద్ర సర్కారును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించిందని గుర్తుచేశారు.
గతంలో మిషన్ మీద తయారైన, పాలిస్టర్ వస్త్రంతో తయారుచేసిన జాతీయ జెండాలకు అనుమతి ఉండేది కాదని, కానీ కేంద్రం ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేసి వాటికి అనుమతించిందని రాహుల్‌గాంధీ చెప్పారు. ఇప్పుడు జాతీయ జెండాల తయారీకి చైనీస్ పాలిస్టర్‌ను వినియోగిస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

