KFC | న్యూఢిల్లీ : కేఎఫ్‌సీ ఫ్రైడ్ చికెన్ గురించి విన్నాం.. ఈ కేఎఫ్‌సీ టూత్‌పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ చైన్ కేఎఫ్‌సీ ఆస్ట్రేలియన్ డెంటల్ కేర్ కంపెనీ హిస్మైల్తో కలిసి ఫ్రైడ్ చికెన్ ఫ్లేవర్‌తో ఓ టూత్‌పేస్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్వల్ప కాలంపాటు మాత్రమే అందుబాటులో ఉండే ఈ టూత్‌పేస్ట్ అమ్మకాలు పూర్తయిపోయాయి.
11 హెర్బ్స్ అండ్ స్పైసెస్ ప్రేరణతో దీనిని తయారు చేశారు. ఈ రెండు కంపెనీలు ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, ‘ఇది ప్రాంక్ కాదు. ఇదిగో, ఇది అత్యంత రుచికరమైనది’ అని పేర్కొన్నాయి. ఈ టూత్‌పేస్ట్ ధర రూ.1,123. దీనిని హిస్మైల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే కొనవచ్చు. మంగళవారం వీటి అమ్మకాలు పూర్తయ్యాయి. కేఎఫ్‌సీ టూత్‌బ్రష్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర సుమారు రూ.5,097.