న్యూఢిల్లీ, నవంబర్ 17: మెక్ డొనాల్డ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనేర్వాలా, హల్దీరామ్స్ వంటి మేజర్ ఫుడ్ చెయిన్స్ ఇక రైల్వే స్టేషన్లలో కొలువుతీరనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ఈ ఫుడ్ కోర్టులు వెలిసేందుకు రంగం సిద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రైల్వే బోర్డుకు చెందిన క్యాటరింగ్ పాలసీలో సంస్కరణలకు శ్రీకారం జరిగింది. 2025 నవంబర్ 13న జారీచేసిన సర్కులర్లో రైల్వే బోర్డు ఈ మేరకు జోనల్ అధికారులకు ఆదేశాలిస్తూ డిమాండు, స్థలం అవసరాల మేరకు ప్రముఖ సింగిల్ బ్రాండ్ ఫుడ్ ఔట్లెట్లను త్వరితంగా అనుమతించాలని పేర్కొంది. ఇవి కంపెనీ ఆధ్వర్యంలో లేదా ఫ్రాంచైజెస్ ద్వారా నిర్వహించాలని, అయితే ఎంపిక మాత్రం ప్రస్తుతం ఉన్న ఈ-వేలం విధానం ద్వారా మాత్రమే ఉండాలని పేర్కొంది.