పట్నా: బీహార్లో యాస్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. దాంతో కీలక ఆస్పత్రుల్లోకి వరదనీరు చేరింది. దర్భంగాలోని ప్రధాన ఆస్పత్రి అయిన దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిని వరదనీరు ముంచెత్తింది. ఆస్పత్రిలోని కొవిడ్ వార్డు సహా అన్ని వార్డుల్లో కొంకులు మునిగేలా వరద నీరు నిలిచిపోయింది. మరోవైపు బెడ్ల నిండుగా రోగులు ఉండటంతో వారికి వైద్యసేవలు అందించడం సిబ్బందికి కష్టతరంగా మారింది.
ఓ వైపు వరదతోనే ఆస్పత్రిలో అపరిశుభ్రత పేరుకుపోయిందంటే మరోవైపు వీధి కుక్కలు కూడా లాబీల్లో సంచరిస్తున్నాయి. అదేవిధంగా బీహార్ రాజధాని పట్నాలోని జై ప్రభ ఆస్పత్రిలో కూడా భారీగా వరదనీరు చేరింది. ఆస్పత్రుల్లో వరదనీటికి సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోల్లో మీరు కూడా వీక్షించవచ్చు.
Bihar | Water enters COVID ward of Darbhanga Medical College and Hospital (DMCH) after heavy rainfall. pic.twitter.com/Bbsqp9IdDX
— ANI (@ANI) May 29, 2021
#WATCH | Bihar: Medicines float in Patna's Jai Prabha Hospital premises as rainwater entered the hospital following Cyclone Yass pic.twitter.com/V6ajqq2SUa
— ANI (@ANI) May 28, 2021