కాసరగోడ్, అక్టోబర్ 29: కేరళలోని కాసరగోడ్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన బాణసంచా పేలుడులో 150 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నీలేశ్వరం సమీపంలోని వీరర్కవు దేవాలయంలో ప్రజలు తెయ్యం ప్రదర్శన చూస్తుండగా, అక్కడ నిల్వ ఉంచిన టపాసులు పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బాధితులను వివిధ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘భద్రతకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. తెయ్యం ప్రదర్శనకు, టపాసుల నిల్వకు కనీసం 100 మీటర్ల దూరాన్ని పాటించాలన్న నిబంధనను పాటించలేదు. టపాసుల నిల్వకు అనుమతి తీసుకోలేదు’ అని జిల్లా కలెక్టర్ తెలిపారు.