MP Suresh Gopi : కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సురేశ్ గోపీ (Suresh Gopi)పై పోలీస్ ఫిర్యాదు నమోదైంది. త్రిస్సూర్ ఎంపీగా కొనసాగుతున్న ఆయనపై కేరళ విద్యార్థి యూనియన్ (KSU) పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా కంప్లైంట్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మలయాళీ నర్సులు అరెస్టు అయినప్పటి నుంచి తమ ‘ఎంపీ సురేశ్ గోపీ కనపడుట లేదు’ అని స్టూడెండ్ యూనియన్ తమ ఫిర్యాదులో పేర్కొంది.
త్రిస్సూర్‌లోని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తమ ఎంపీపై ఫిర్యాదు అనంతరం ఎస్కేయూ జిల్లా అధ్యక్షుడు గోకుల్ గురువయూర్ (Gokul Guruvayur) మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో కేరళ నర్సులపై కుట్రపూరితంగానే కేసు పెట్టారని ఆరోపించాడు. ‘గత రెండు నెలల నుంచి మా ప్రాంత ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోప్ నియోజకవర్గంలోని కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. మానవ అక్రమ రవాణా కేసు కింద ఛత్తిస్గఢ్లో కేరళకు చెందిన ఇద్దరు నర్సులను అక్రమంగా అరెస్ట్ చేశారు. అదొక కుట్రపూరిత కేసు.
“ಕೇಂದ್ರ ಸಚಿವರು ಸಂಪರ್ಕಕ್ಕೆ ಸಿಗುತ್ತಿಲ್ಲ”: ಸುರೇಶ್ ಗೋಪಿ ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದಾರೆ ಎಂದು ದೂರು ನೀಡಿದ ಕೇರಳ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಂಘಟನೆ!
Read More here: https://t.co/HHrLNEVxhe#SureshGopi #kerala pic.twitter.com/jTiJFHqbMn— ವಾರ್ತಾ ಭಾರತಿ | Vartha Bharati (@varthabharati) August 10, 2025
ఆ రోజు రోజు నుంచి ఎంపీ సురేశ్ గోపీ తమ నియోజకవర్గంలో కనిపించడం లేదు. అందుకే మా విద్యార్థి సంఘం తరఫున పోలీసులకు ఆయనపై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం. మా ఎంపీని సగటు పౌరుడే కాదు మేయర్ కూడా కలవలేరు. ఆయన ఆఫీస్‌కు ఫోన్ చేసి ఎంపీ ఉన్నారా? లేరా? అని అడిగితే సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పడం లేద’ని గోకుల్ పేర్కొన్నాడు.
సినీ హీరోగా అశేష అభిమానగణం కలిగిన సురేశ్ గోపీ.. కేరళ నుంచి బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన తొలి వ్యక్తి. దక్షిణాదిపై పట్టుకోసం యత్నిస్తున్న మోడీ ప్రభుత్వం అందుకే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలు వస్తున్న విషయం తెలిసిందే. సురేశ్ గోపీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల బీజేపీ కార్యకర్తలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
#kerala: KSU files police complaint alleging Thrissur MP Suresh Gopi missing
KSU Thrissur district president Gokul Guruvayur has lodged a complaint with Guruvayur East Police stating that Union Minister and Thrissur MP Suresh Gopi has not been seen in his constituency since the… pic.twitter.com/ApjRAey68i
— South First (@TheSouthfirst) August 10, 2025