తిరువనంతపురం: కేరళ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే పీటీ థామస్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్లు. తమిళనాడులోని వెల్లోర్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గడిచిన నెల రోజుల నుంచి ఆయన ఆ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం త్రిక్కకరా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఆయన ఒక్కరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఇడుక్కి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వీక్షణం పత్రికకు ఎడిటర్, మేనేజింగ్ డైరక్టర్గా చేశారు.