న్యూఢిల్లీ : ఆపదలో అండగా నిలిచే పోలీసు అధికారులు ప్రజలకు బాసటగా నిలిచిన వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. అయితే ఓ చిన్నారి పోలీస్ అధికారికి సెల్యూట్ చేస్తున్న వీడియోను (Viral Video) కేరళ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను కేరళ పోలీసులు ఇన్స్టాగ్రాం, ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కారు పక్కన నిలుచున్న పోలీస్ వద్దకు చిన్నారి బాలిక పరుగున వెళ్లడం కనిపిస్తుంది. ఆపై పోలీసుకు బాలిక సెల్యూట్ చేయడంతో ఆయన తిరిగి సెల్యూట్ చేయడం పలువురిని ఆకట్టుకుంది. కుంజుమోల్ నుంచి శుభాకాంక్షలు అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్లిప్‌ను ఆన్లైన్లో షేర్ చేసినప్పటినుంచి ఇప్పటివరకూ 3.63 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
ఈ స్వీట్ వీడియో తమను ఆకట్టుకుందని పలువురు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఇక ఓ విద్యార్ధి సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు పోలీస్ అధికారి సహకరించిన ఘటన గుజరాత్లో వెలుగుచూడగా, కోల్‌కతాలోనూ ఓ విద్యార్ధి పరీక్షా కేంద్రానికి చేరేలా ఓ పోలీస్ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన ఉదంతం పలువురిని ఆకట్టుకుంది.
Read More :
Viral Video | సిగ్నల్ వద్ద 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
Rupert Murdoch | 92 ఏండ్ల వయసులో.. ఐదో పెండ్లికి సిద్ధమైన బిలియనీర్