Suresh Gopi | తిరువనంతపురం, నవంబర్ 3: కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపిపై కేరళ పోలీసు కేసు నమోదుచేశారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో త్రిస్సూర్‌లో జరిగిన వేడుకకు సురేశ్ గోపి అంబులెన్స్ లో హాజరుకావటం వివాదాస్పదమైంది.
దీనిపై ఓ కమ్యూనిస్ట్ నాయకుడి నుంచి కేరళ పోలీసులకు ఫిర్యా దు అందింది. దీంతో సురేశ్ గోపిని మొదటి నిందితుడిగా, అంబులెన్స్ డ్రైవర్‌ను మూడో నిందితుడిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నది.