కేరళ ఉన్నత విద్యామంత్రి రాజీనామా.. ఆ తప్పు చేసినందుకేనట..!

తిరువనంతపురం: కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ తన పదవికి రాజీనామా చేశారు. కేటీ జలీల్ ఒక ప్రజాప్రతినిధి అయిఉండి తన విధులను దుర్వినియోగం చేశాడని, ఉద్దేశపూర్వకంగానే తన బంధవులకు లబ్ధి చేకూర్చే పనులు చేశాడని ఇటీవల ఆ రాష్ట్ర లోకాయుక్త నిర్ధారించారు. అక్రమానికి పాల్పడినందున ఆయన మంత్రిగా కొనసాగడానికి అర్హులు కాదని, తక్షణమే తన మంత్రి పదవిగా రాజీనామా చేయాలని ఆదేశించారు.
దాంతో లోకాయుక్త ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ మంత్రి కేటీ జలీల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు బెంచ్ సైతం కేటీ జలీల్ అక్రమానికి పాల్పడ్డాడనే ఆరోపణలకు విశ్వసిస్తూ అతనికి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేటీ జలీల్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి విజయన్‌కు పంపగా, ఆయన దాన్ని గవర్నర్‌కు పంపించారని కేరళ సీఎంవో తెలిపింది.
ఈ విషయాన్ని మంత్రి కేటీ జలీల్ కూడా తన ఫేస్బుక్ పోస్టు ద్వారా ధృవీకరించారు. కాగా, 2018 నవంబర్‌లో ముస్లిం యూత్ లీగ్ లీడర్ అదీబ్ చేసిన ఫిర్యాదు మేరకు కేటీ జలాల్ అక్రమాలపై కేరళ లోకాయుక్త విచారణ చేపట్టారు. అదీబ్ ఆరోపణలు నిజమేనని విచారణలో రుజువు కావడంతో మంత్రిని పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

