మూర్చతో బిల్డింగ్ పైనుంచి పడబోయిన సహచరుడ్ని కాపాడిన వ్యక్తి

తిరువనంతపురం: మూర్చతో బిల్డింగ్ పైనుంచి కిందకు పడబోయిన సహచరుడ్ని ఒక వ్యక్తి కాపాడాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బిను అలియాస్ బాబు, బాబురాజ్ అనే ఇద్దరు వడకరలోని కేరళ బ్యాంకు శాఖలో పని చేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు కోసం భవనం తొలి అంతస్తులో ఉన్న ఆ బ్యాంకు శాఖ బయట వారు ఎదురు చూస్తున్నారు. ఇంతలో పిట్టగోడ అంచుకు ఆనుకుని ఉన్న బాబుకు మూర్చ రావడంతో ఒక్కసారిగా కిందకు పడిపోసాగాడు.
గమనించిన బాబురాజ్ వెంటనే స్పందించి అతడి కాళ్లు పట్టుకున్నాడు. ఇంతలో అక్కడున్న వారు వచ్చి సహాయం చేసి బాబును పైకి లాగారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఆ భవనం మొదటి అంతస్తు కింద కరెంట్ తీగలు ఉన్నాయని, ఒకవేళ బాబు అక్కడి నుంచి పడి ఉంటే ప్రాణాలకు ముప్పు కలిగేదని అక్కడి వారు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బాబును కాపాడిన బాబురాజ్ను వారు ప్రశంసించారు.
మరోవైపు బ్యాంకు సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు బాబురాజ్ను కొనియాడారు. సమయస్ఫూర్తితో తక్షణం స్పందించి బాబు కాళ్లను పట్టుకుని రక్షించేందుకు అతడు చేసిన సాహసాన్ని పలువురు ప్రశంసించారు.
😱😱😱😱😱 pic.twitter.com/9GPTce1xnt
— Anu Satheesh 🇮🇳 (@AnuSatheesh5) March 19, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

