Boat Tragedy: కేరళ బోటు బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా
Boat Tragedy: బోటు ట్రాజిడీపై జుడిషియల్ విచారణకు సీఎం విజయన్ ఆదేశించారు. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 22కు చేరింది. బాధిత కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.
తిరువనంతపురం: కేరళలోని తన్నూర్ ప్రాంతంలోని తూవలతీరం బీచ్ వద్ద బోటు బోల్తాపడిన(Boat Tragedy) ఘటనలో 22 మంది మృతిచెందారు. ఆదివారం రాత్రి జరిగిన ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీఎం పినరయి విజయన్ ఇవాళ కలిశారు. ఈ ఘటన పట్ల ఆయన జుడిషియల్ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఆయన ప్రకటించారు.
తిరురంగాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాద బాధితులను ఇవాళ ఆయన కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఓ విషాదం అన్నారు. చికిత్స పొందుతున్న వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు నిపుణులతో కూడిన జుడిషియల్ కమీషన్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు.
ప్రధాని మోదీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 2 లక్షలు ఇ్వవ్వనున్నట్లు తెలిపారు. కేరళలో ఇవాళ సంతాప దినం పాటిస్తున్నారు. అధికారిక ఈవెంట్లను రద్దు చేశారు. బోటు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతిచెందారు. ఆ కుటుంబాన్ని కూడా ఇవాళ సీఎం విజయన్ పరామర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

