కాసర్గడ్: కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్(Kerala Professor)గా చేస్తున్న డాక్టర్ ఇఫ్తికర్ అహ్మద్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎంఏ ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఆయనపై ఫిర్యాదు చేశారు. శృంగార కావ్యాల గురించి పాఠాలు చెబుతూ.. ఆ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. శృంగార రచన పేరుతో ఆ ప్రొఫెసర్ చాలా నీచంగా సెక్స్ గురించి మాట్లాడుతున్నట్ల విద్యార్థులు ఆరోపించారు. మహిళల్ని ఓ శృంగార వస్తువుగా ట్రీట్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థిని ప్రొఫెసర్ ఇఫ్తికర్ అసభ్యంగా టచ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. తాగిన మైకంలో విద్యార్థిని ప్రొఫెసర్ టచ్ చేసినట్లు మహిళా మెడికల్ ఆఫీసర్ ఆరోపించారు. ఫస్ట్ ఇయర్ క్లాసులో ఉన్న 41 మంది విద్యార్థుల్లో 33 మంది ఆ ఫ్రొఫెసర్‌కు వ్యతిరేకంగా సంతకం చేశారు.