తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పేరు మార్పు మరోమారు తెరపైకి వచ్చింది. కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును ‘కేరళం’గా సవరించాలి.
8వ షెడ్యూల్లోని భాషలు సహా అన్ని భాషల్లోనూ ‘కేరళం’గా పేరు మార్చడానికి కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలి’ అని సీఎం విజయన్ చెప్పారు. రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని ఎల్డీఎఫ్ సర్కార్ 2023లోనూ తీర్మానం చేయగా, కేంద్రం సాంకేతిక కారణాల్ని చూపుతూ అభ్యంతరం తెలిపింది. మలయాళ ఉచ్ఛారణ ప్రకారం రాష్ట్రం పేరు ‘కేరళం’ అవుతుందని విజయన్ అన్నారు.