KC Venugopal | మహారాష్ట్ర ఎన్నికల్లో షిండే సర్కార్‌ను సాగనంపుతాం : కేసీ వేణుగోపాల్
KC Venugopal : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అవినీతి సర్కార్‌ను ప్రజలు సాగనంపుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.
KC Venugopal : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అవినీతి సర్కార్‌ను ప్రజలు సాగనంపుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఎంవీఏ సర్కార్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు పట్టం కడతారని, అవినీతి కాషాయ సర్కార్‌ను మట్టికరిపించేందుకు తాము దృఢ నిశ్చయంతో పనిచేస్తామని చెప్పారు.
తాము కలిసికట్టుగా పోరాడుతూ ప్రజల గొంతుకను వినిపిస్తామని అన్నారు. పార్టీ పటిష్టత కోసం ఈరోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలందరూ సుహృద్భావ వాతావరణంలో చర్చించారని తెలిపారు. ఎన్నికల సన్నద్ధత కోసం జరిగిన భేటీలో మహారాష్ట్రలో అవినీతి సర్కార్‌ను పారద్రోలేందుకు పార్టీ శ్రేణుల్లో ఎన్నడూలేని ఉత్సాహం కనిపించిందని తెలిపారు.
మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్ కొలువుతీరడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ప్రజా సమస్యలపై పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఏక్నాథ్ షిండే సర్కార్ సహజసిద్ధమైన ప్రభుత్వం కాదని, రానున్న ఎన్నికల్లో షిండే సర్కార్‌కు నూకలు చెల్లుతాయని, ఎంవీఏ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని కేసీ వేణుగోపాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
DK Shivakumar | అవినీతిలో కాషాయ పాలకులదే అగ్రస్ధానం : డీకే శివకుమార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

