పనాజీ: గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్(Goa Nightclub)లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే, ఓ బెల్లీ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని విషయాలను వెల్లడించారు. మెహబూబా ఓ మెహబూబా సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్న డ్యాన్సర్‌ను కజకిస్థాన్‌కు చెందిన క్రిస్టినాగా గుర్తించారు. ఇండియాలో డ్యాన్స్ చేసేందుకు ఆమెను బిజినెస్ వీసా లేదని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో ఆ డ్యాన్సర్‌కు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. డ్యాన్స్ చేస్తున్న స్టేజ్ వెనుక మెల్లమెల్లగా అగ్ని రాజుకున్నది.
స్టేజ్ వెనుక నుంచి మంటలు వ్యాపించడంతో.. డ్యాన్సర్ క్రిస్టినాతో పాటు అక్కడ సాంగ్స్ పర్ఫార్మ్ చేస్తున్న బ్యాండ్ సభ్యులు కూడా ప్రాణ భయంతో పరుగులు తీశారు. డ్యాన్సర్ క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నదని, కానీ ఇప్పటి వరకు ఆ వీసా మంజూరీ కాలేదని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు పేర్కొన్నది. అనుమతి లేకుండానే ప్రొఫెషనల్‌గా ఆమె డ్యాన్స్ చేయడం నేరమే అవుతుందని పోలీసులు చెప్పారు.
క్రిస్టినా షేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టా వీడియోల ఆధారంగా ఆ నైట్‌క్లబ్‌లో రెగ్యులర్‌గా డ్యాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బాణాసంచా వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
गोवा के नाइट क्लब का नया वीडियो आया सामने ।
आगे बार बाला डांस कर रही है और पीछे आग बरस रही है। pic.twitter.com/6IqUliYbaq
— राजू वाल्मीकि चौहान (@RajuValmikiN) December 7, 2025