న్యూఢిల్లీ: మాల్దీవుల పర్యాటకానికి గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నియమితులయ్యారు. ఆ దేశ మార్కెటింగ్, ప్రజా సంబంధాల శాఖ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐకాన్‌గా, విలక్షణ నటిగా, అనేక అవార్డులు అందుకున్న ఆంత్రప్రెన్యూర్‌గా కత్రినా కైఫ్‌ను మాల్దీవులు పేర్కొన్నది. మాల్దీవుల ప్రకటనపై కత్రినా కైఫ్ హర్షం వ్యక్తం చేశారు. గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.