Armymens Killed | జమ్మూ కశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సైనికుల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డగా.. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి సమయంలో మాచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఉగ్రవాదులు మొదట గ్రెనేడ్స్ విసిరారు. ఆ తర్వాత కాల్పలు జరిపారు. వెంటనే సైన్యం తేరుకొని కాల్పులు జరుపగా.. ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు తెలిపారు.
ఘటన అనంతరం బలగాలను రంగంలోకి దింపి ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 48 గంటల్లో జమ్మూ ప్రాంతంలో సైన్యంపై దాడి జరుగడం ఇది రెండోసారి. ఆదివారం రాజౌరీ జిల్లా ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడు ప్రానాలు కోల్పోయారు. కుల్గామ్ జిల్లాలో వేర్వేరుగా జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24గంటల తర్వాత ఉగ్రవాదులు.. సైన్యంపై మరోసారి దాడికి తెగబడ్డారు.