శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని హిందువులు మత సామరస్యాన్ని చాటారు. సౌదీలోని మక్కాకు హజ్ యాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన ముస్లింలకు గులాబీలు, హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అంతేగాక ఇస్లామిక్ మతానికి సంబంధించిన పాటలు కూడా పాడారు. హజ్ యాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన స్థానిక ముస్లింలకు శ్రీనగర్ ఎయిర్ట్‌పోర్టు వద్ద ఇలా స్వాగతం పలికిన కశ్మీరీ పండిట్లు సోదరభావాన్ని, మత సామరస్యాన్ని చాటారు.
కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూటమిలోని ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) ఎమ్మెల్యే అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. ‘హజ్ యాత్ర చేసి తిరిగి వచ్చిన యాత్రికులు శ్రీనగర్ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కశ్మీరీ పండిట్ సోదరులు ‘నాట్’ పఠిస్తూ హారతి, గులాబీలు ఇస్తూ స్వాగతం పలికారు. హజ్ యాత్రికులకు అభినందనలు తెలిపారు. కశ్మీరీ పండిట్లు చూపిన ఈ ప్రేమ, చెడ్డ రాజకీయాల దృష్టిలో పడకూడదని ఆశిస్తున్నాను’ అని హిందీలో పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हज करके लौटे हाजी लोग श्रीनगर एयरपोर्ट से निकले तो कश्मीरी पंडित भाईयों ने नात पढ़ते हुए आरती उतार कर उनका स्वागत किया और मुबारकबाद दी।
इस मुहब्बत को राजनीति की नज़र ना लगे। pic.twitter.com/Oo338QsrlV— Abbas Bin Mukhtar Ansari (@AbbasAnsari_) July 16, 2022