Pahalgam Attack | కాశ్మీర్లో మళ్లీ పుంజుకున్న పర్యాటకం.. భారీ సెక్యూరిటీ మధ్య పహల్గాంలో తెరుచుకున్న కేంద్రాలు
Pahalgam Attack : పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్లో మళ్లీ పర్యాటకం ఊపందుకుంది. గత ఏడాది పహల్గాం దాడి తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకం నెమ్మదిగా దెబ్బతింది. కానీ, ఇప్పుడు మళ్లీ పర్యాటక రంగం దూసుకెళ్తోంది.
Pahalgam Attack : పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్లో మళ్లీ పర్యాటకం ఊపందుకుంది. గత ఏడాది పహల్గాం దాడి తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకం నెమ్మదిగా దెబ్బతింది. కానీ, ఇప్పుడు మళ్లీ పర్యాటక రంగం దూసుకెళ్తోంది. కాశ్మీర్‌లోని పహల్గాం దాడి జరిగి నేటికి ఏడాది. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. కాల్పులు జరిపి 26 మందిని హతమార్చారు.
దీంతో అప్పటినుంచి ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. దాడి అనంతరం మొత్తం 48 ప్రాంతాలను అధికారులు మూసేశారు. వాటిలో ఒక్కోటి నెమ్మదిగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ 48 పర్యాటక కేంద్రాల్లో 39 తిరిగి తెరుచుకున్నాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడికి భద్రతా దళాలు 25 నిమిషాల తర్వాత చేరుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ మార్గం మొత్తం సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పహల్గాం నుంచి అక్కడి ప్రధాన టూరిస్ట్ కేంద్రమైన బైసరన్‌కు ఐదు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రదేశంలో ఇప్పుడు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు స్థానిక పోలీసులు ఇప్పుడు 24 గంటలపాటు కాపలా కాస్తున్నారు. మరోవైపు మారిన పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులు తరలివస్తున్నారు. కొన్ని ఆంక్షలున్నప్పటికీ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.
స్థానిక వ్యాపారం కూడా పుంజుకుంది. హోటళ్లు, షాపులు మళ్లీ కళకళలాడుతున్నాయి. టౌన్ ఎంట్రీ వద్ద టోల్ ఫీజులు కూడా భారీగా వసూలవుతున్నాయి. గత మార్చి నుంచి ఇక్కడి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఇటీవలి కాలంలో ఇక్కడి టులిప్ గార్డెన్‌కు సందర్శకులు భారీగా పెరిగారు. ఈ సీజన్లో మొత్తం 1.8 మిలియన్ టులిప్ పూలు పూశాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు తరలివచ్చారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి గార్డెన్ మూసేసేవరకు 2,52,000 మంది సందర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

